బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు: హోం మంత్రి అనిత

బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Updated : 06 Jul 2024 06:44 IST

పాయకరావుపేట, న్యూస్‌టుడే: బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. పాయకరావుపేట బాలికోన్నత పాఠశాల వద్ద గంజాయి తాగుతూ, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేస్తామని వెల్లడించారు.


మా నాన్నను తీసుకురారూ..

బాలికను ఓదారుస్తున్న అనిత

‘ఆరు నెలల నుంచి మా నాన్న కనిపించడం లేదు. మా నాన్నను తీసుకురారూ..’ అంటూ ఓ బాలిక హోం మంత్రి అనిత వద్ద కన్నీటి పర్యంతమైంది. పాయకరావుపేట పాఠశాలలో చదువుతున్న బాలిక, తన తల్లి మాడుగుల లక్ష్మితో కలిసి మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకుంది. రాజవరంలో ట్రక్‌ డ్రైవరుగా పనిచేస్తున్న లక్ష్మి భర్త ఆరు నెలల నుంచి కనిపించడం లేదు. దీనిపై పోలీసు స్టేషన్‌లోనూ కేసు నమోదైందని చెప్పారు. స్పందించిన హోం మంత్రి వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పి, అధికారులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని