హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి

రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి.

Published : 06 Jul 2024 05:36 IST

అమరావతిలో సీఆర్డీఏ నాటిన మొక్కలతో అల్లుకున్న పచ్చదనం 

రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. గత తెదేపా ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని పచ్చందాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఆ మేరకు సీఆర్డీఏ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటించింది. ఆ మొక్కలే ఇప్పుడు పెరిగి పందిరిలా అల్లుకున్నాయి. గడిచిన ఐదేళ్లలో నరకడమే తెలిసిన పాలకులు ఈ వైపు రాకపోవడంతో ఇవి బతికిపోయాయని స్థానికులు అంటున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని