అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి

ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లా నుంచి పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతితోపాటు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు వీలుగా అనంతపురంలో ఎయిర్‌పోర్టుతోపాటు, విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి కోరారు.

Published : 06 Jul 2024 05:13 IST

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి మంత్రి పయ్యావుల, ఎంపీల వినతి

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి
రామ్మోహన్‌నాయుడికి  వినతిపత్రం సమర్పిస్తున్న మంత్రి పయ్యావుల
కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి

ఈనాడు, దిల్లీ: ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లా నుంచి పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతితోపాటు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు వీలుగా అనంతపురంలో ఎయిర్‌పోర్టుతోపాటు, విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి కోరారు. ఈ ముగ్గురూ శుక్రవారం ఇక్కడ కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యాన పంటలు అనంతపురం జిల్లాలో సాగవుతున్నాయని, ఎగుమతులకు అవకాశం లేక ఇక్కడి రైతులు నష్టపోతున్నారని వీరు కేంద్రమంత్రికి వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుచేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించి కరువు పీడిత ప్రాంతానికి వరంగా మారుతుందని తెలిపారు. అలాగే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంవల్ల ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని..అధ్యయనం చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు లక్ష్మీనారాయణ, పార్థసారథి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని