శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్‌ ఛైర్మన్, రేమండ్స్‌ సీఎండీ

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్‌ దర్శన సమయంలో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్, రేమండ్స్‌ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు.

Published : 06 Jul 2024 05:28 IST

తిరుమల ఆలయం ఎదుట టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్‌ దర్శన సమయంలో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్, రేమండ్స్‌ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. తితిదే ఈవో జె.శ్యామలరావును స్థానిక శ్రీపద్మావతి అతిథిగృహంలో రేమండ్స్‌ గ్రూప్‌ సీఎండీ మర్యాదపూర్వకంగా కలిశారు. నవీ ముంబయిలో శ్రీబాలాజీ మందిర నిర్మాణం, తిరుమల ఎస్వీ ఉన్నత పాఠశాలలో సింఘానియా ఎడ్యుకేషన్‌ ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వారు చర్చించారు.

తితిదే ఈవో జె.శ్యామలరావుతో రేమండ్స్‌ సీఎండీ గౌతమ్‌ సింఘానియా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని