ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 06 Jul 2024 05:19 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం అంచనా వేస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. విపత్తుల నిర్వహణ సంస్థ మాత్రం శనివారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశముందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని