ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి

మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్‌.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్‌ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 06 Jul 2024 05:21 IST

జడ్జి రామకృష్ణ వ్యాజ్యంలో చిత్తూరు కోర్టు పీఓకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్‌.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్‌ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జి ఎస్‌.రామకృష్ణకు రెండు రోజుల్లో ధ్రువపత్రాలు అందజేయాలని ఆదేశించింది. ధ్రువపత్రాలు అందించడంలో చోటు చేసుకున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని సంబంధిత కోర్టు న్యాయాధికారి(పీఓ)ని ఆదేశించింది. విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి ఎస్‌.రామకృష్ణ చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా కోర్టు/ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలు అందజేయాలని జడ్జి రామకృష్ణ దరఖాస్తు చేశారు. ఫీజు కూడా చెల్లించారు. ఇప్పటి వరకు కాపీలు అందజేయకపోవడంతో రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని