రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం

విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్‌సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.

Published : 06 Jul 2024 05:28 IST

సీఎం చంద్రబాబుకు అందజేసిన ఎంపీ కలిశెట్టి 

విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఈనాడు, దిల్లీ: విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్‌సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం సంబంధిత చెక్కును అందించారు. ఇటీవల తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తీసుకున్న నిర్ణయం మేరకు విరాళం ఇచ్చినట్లు ఎంపీ చెప్పారు. ‘‘సాధారణంగా తొలి వేతనాన్ని ఏ బిడ్డయినా తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడం భారతీయ సంప్రదాయం. అదే మాదిరి తాను ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి తండ్రి సమానులైన చంద్రబాబుకు అందించా. ఇది ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చింది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని