పవన్‌కల్యాణ్‌ వారాహి దీక్షోద్వాసన

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు.

Updated : 06 Jul 2024 11:47 IST

అమ్మవారికి హారతి ఇస్తున్న పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వారాహి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. ఆ తర్వాత కుంభ హారతితో ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ్‌ శర్మ, వేణుగోపాల శర్మలు పూజా క్రతువు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.

పవన్‌కల్యాణ్‌ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్తాచార రీతిలోనే దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని