వాసుదేవరెడ్డి, కొడాలి నానిపై కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోపాటు పలువురిపై గుడివాడ టూటౌన్‌ పోలీసులు కేసులు నమోదుచేశారు.

Published : 07 Jul 2024 05:03 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోపాటు పలువురిపై గుడివాడ టూటౌన్‌ పోలీసులు కేసులు నమోదుచేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ గోదామును దుగ్గిరాల ప్రభాకర్‌ తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో 2011లో టెండరు పొందారు. టెండరు గడువు పూర్తికాకుండానే దాన్ని ఖాళీ చేయించి, మళ్లీ టెండరులో పాల్గొంటే చంపేస్తామని నాని, వాసుదేవరెడ్డి బెదిరించారని ప్రభాకర్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వాసుదేవరెడ్డి, కొడాలి నాని, అతని అనుచరులైన వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, కసుకుర్తి జనార్దన్‌ అలియాస్‌ గుడ్లవల్లేరు బాబ్జీ, పాలడుగు రామ్‌ ప్రసాద్, నాటి ఉమ్మడి కృష్ణా జేసీ మాధవీలతరెడ్డిపై శనివారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని