ఛైర్మన్‌ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు

ఉన్నత విద్యామండలికి ఛైర్మన్‌ లేనందున జూన్‌ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు.

Published : 07 Jul 2024 06:22 IST

ఉన్నత విద్యామండలి అధికారుల తీరిది
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు హేమచంద్రారెడ్డి తెరవెనుక చర్యలు

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలికి ఛైర్మన్‌ లేనందున జూన్‌ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వంలో ఛైర్మన్‌గా నియమితులైన హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడంతో జూన్‌ 4 నుంచి జూన్‌ 30 వరకు ఆయన మెడికల్‌ లీవ్‌ పెట్టారు. ఈ సమయంలో వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావును.. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. జులై 1న విధుల్లో చేరిన హేమచంద్రారెడ్డి మళ్లీ సెలవుపై వెళ్లారు. ఆయన విధుల్లో చేరడంతో ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి రామమోహన్‌రావు తప్పుకొన్నారు. ఎవరినీ ఛైర్మన్‌గా నియమించకపోవడంతో జీతాలకు ఇబ్బంది ఏర్పడింది. ఉన్నత విద్యామండలిలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల బిల్లులు పెట్టేందుకు వైస్‌ఛైర్మన్‌ రామమోహన్‌రావు అంగీకరించడం లేదు. వైకాపా హయాంలో నియమితులైన అధికారులు.. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆ వ్యతిరేకతను కొత్త ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని