గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!

గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది.

Published : 07 Jul 2024 06:18 IST

రూ.15 లక్షల బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు నిర్వాకం

చాకిరాల గ్రామ సచివాలయ భవనం ముందు నిలిపిన బోర్‌ వెల్‌ లారీ

కనిగిరి, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. దీంతో ఓ గుత్తేదారు తాను నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఏడాది కాలానికి అద్దెకు ఇచ్చేసిన ఉదంతం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. కనిగిరి మండలంలోని చాకిరాల గ్రామ సచివాలయ భవనం పనులు 80 శాతం పూర్తయ్యాయి. వాటికి సంబంధించి గత వైకాపా ప్రభుత్వం గుత్తేదారుకు ఇంకా రూ.15 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ కారణంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా, సదరు గుత్తేదారు దాన్ని బోర్‌వెల్స్‌ నిర్వాహకులకు అద్దెకు ఇచ్చేశారు. వారు భవనం లోపల సామాన్లు భద్రపర్చుకొని, బయట ఖాళీస్థలంలో లారీలు నిలుపుతున్నారు. దీనిపై సర్పంచి అరవిందలూక శనివారం కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి.. బోర్‌వెల్స్‌ వారిని ఖాళీ చేయించి, సదరు గుత్తేదారుపై చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని