నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్‌ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు అన్నారు.

Published : 07 Jul 2024 05:09 IST

జూనియర్‌ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు సూచన

నూతన చట్టాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మన్మథరావు, జస్టిస్‌ శ్యాంసుందర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

అనంతపురం(లీగల్‌), న్యూస్‌టుడే: బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్‌ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు అన్నారు. అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో... చట్టాలపై అవగాహన సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంసుందర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మన్మథరావు మాట్లాడుతూ... కక్షిదారులకు న్యాయం దక్కేలా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. జాతీయ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రామిరెడ్డి మాట్లాడుతూ.. జూనియర్‌ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురుప్రసాద్‌ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం బార్‌ అసోసియేషన్‌ కృషి చేస్తోందన్నారు. అనంతరం న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు నూతన చట్టాల పుస్తకాలను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని