ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు

వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం  వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Published : 07 Jul 2024 05:09 IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నం వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువలో పూజలు చేస్తున్న రైతులు, కూటమి నేతలు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం  వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పలాస మండలంలోని టెక్కలిపట్నం వద్ద రైతులు, కూటమి నేతలు శనివారం వంశధార ఎడమ ప్రధాన కాలువలో నీటికి పూజలు చేశారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో వంశధార కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయకపోవడంతో మొక్కలు, పూడిక పెరిగిపోయాయి. శివారు ప్రాంతాలకు నీరందక వర్షాధారంగా సాగు చేశారు. తెదేపా నేత, ప్రస్తుత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అప్పట్లో అధికారులకు అనేకసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. నీరందిస్తానని ఎన్నికల ప్రచారంలో ఆమె మాట ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన నెల    రోజుల్లోనే హామీని నెరవేర్చారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా రైతుల ఇబ్బందులను దృష్టి ఉంచుకుని వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పూడికతీత పనులకు రూ.90 లక్షలను మంజూరు చేయించారు. ఐదేళ్ల తర్వాత కాలువలో నీటిని చూసిన రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని