ఇసుక దోపిడీకి రాచమార్గం

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్‌లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు.

Published : 07 Jul 2024 05:09 IST

వైకుంఠపురం వద్ద కృష్ణా నదికి అడ్డంగా ఇసుక రవాణాకు ఏర్పాటుచేసిన తాత్కాలిక వంతెన

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్‌లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. ఇందుకోసం కృష్ణానదిలో అడ్డంగా తాత్కాలిక వంతెన నిర్మించారు. నదీ గర్భాన్ని తవ్వేసి నిత్యం వందల లారీల్లో ఇసుక అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనలనూ తుంగలో తొక్కారు. హైకోర్టు సూచనలతో అధికారులు తనిఖీలు చేసినా.. చివరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడూ వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. ఐదేళ్లలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

ఈనాడు, గుంటూరు, న్యూస్‌టుడే, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు