ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ల రాజీనామా

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్‌ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు.

Published : 07 Jul 2024 05:10 IST

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ  ట్రిపుల్‌ఐటీలో రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డితో మాట్లాడుతున్న కుమారస్వామి గుప్తా 

వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్‌ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు వివిధ వర్సిటీల నుంచి గతేడాది డిసెంబరు ఒకటిన మూడేళ్ల కాలపరిమితితో డైరెక్టర్లుగా వచ్చారు. పదవీకాలం 2026 నవంబరు 20 వరకు ఉండగా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పలు కారణాల వల్ల రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను వర్సిటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారులకు పంపించారు.

నూజివీడు ట్రిపుల్‌ఐటీలో పలువురు అధికారుల రాజీనామా

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో పలువురు అధికారులు రాజీనామా చేశారని ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త అమరేంద్రకుమార్‌ శనివారం తెలిపారు. డైరెక్టర్‌ ఆచార్య ఎం.చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌.ఎస్‌.ఎస్‌.వి.గోపాలరాజు, ప్రధాన పాలనాధికారి (సీఏఓ) బి.ప్రసాద్, అకడమిక్స్‌ డీన్‌ శ్రావణి, పరీక్షల విభాగం డీన్‌ భానుకిరణ్‌ రాజీనామా చేస్తున్నారని, సంబంధిత పత్రాలను కులపతికి శుక్రవారం పంపారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని