వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్‌

శాఖ కేంద్రంగా వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్‌ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Published : 07 Jul 2024 05:11 IST

జెండా ఊపి విశాఖ-పూరీ ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్న ఎంపీ శ్రీభరత్‌.. చిత్రంలో డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్‌ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో మేజర్‌ స్టేషన్‌ ఉన్నందున ఇక్కడే డివిజన్‌ ఉండటం అవసరమని అన్నారు. ఈ విషయాన్ని రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ దృష్టికి తీసుకెళతామన్నారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి మరిన్ని రైళ్లను నడపడానికి రాజకీయంగా, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖ-విజయవాడ మధ్య ఇటీవల పలు రైళ్లను రద్దుచేయడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత వేగంగా పనులు పూర్తిచేసి, రద్దు చేసిన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులను కోరారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని