ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు.

Published : 07 Jul 2024 05:12 IST

అమ్మవారికి మొదటి సారె తీసుకొస్తున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన సిబ్బంది

విజయవాడ (ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. తాళ్లాయిపాలెం శైవపీఠాధిపతి శివస్వామి నేతృత్వంలో మరో బృందం కూడా అమ్మవారికి సారె సమర్పించింది. అమ్మవారి దర్శనానంతరం మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో అర్చకులు వీరి నుంచి సారె స్వీకరించారు. ఆలయ ఈఓ రామారావు మాట్లాడుతూ.. ఆషాఢమాసంలో ఈ నెల 6 నుంచి ఆగస్టు 4 వరకు జగన్మాతకు సారె సమర్పించే బృందాలు ముందస్తుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని