గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్‌ రాజేంద్రనగర్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది.

Published : 07 Jul 2024 06:09 IST

కాంగ్రెస్‌ హయాంలో వేసిన శిలాఫలకం వద్ద ఇటీవల నిర్మించిన రహదారి 

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్‌ రాజేంద్రనగర్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా రహదారి నిర్మాణానికి ఒక శిలాఫలకం వేశారు. ఇదే రహదారిని విస్తరించేందుకు వైకాపా ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరుకాగా ఇటీవల రోడ్డు నిర్మించారు. గతంలో వేసిన శిలాఫలకం రహదారి మధ్యలోకి వచ్చినా ఏమాత్రం జరపకుండా అలాగే వదిలేశారు. ఇదే మార్గంలో వైకాపా ప్రభుత్వంలో అప్పటి మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించిన శిలాఫలకం సైతం రహదారికి అడ్డంగా వదిలేశారు. 

ఈనాడు, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు