జాతీయ రహదారులు, జలవనరులను విస్తరించాలి

రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల విస్తరణకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Updated : 08 Jul 2024 06:17 IST

ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి
ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల వినతి

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి తమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల విస్తరణకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సమ్మతించాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబును ఆయన నివాసంలో మంత్రి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను విన్నవించారు. ‘పట్టిసీమ నుంచి పులిచింతల లింక్‌ ద్వారా శ్రీశైలం నీటితో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరుతాయి. దీని వల్ల తెలంగాణకూ మేలు జరుగుతుంది. సత్తుపల్లి నుంచి కోవూరు రైల్వేలైన్, పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వేలైన్‌ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరం. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వేలైన్‌ పూర్తయింది. ఏపీలో దీని కొనసాగింపు లైన్‌పై దృష్టి సారించాలి’ అని తుమ్మల కోరారు. అనంతరం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయంగా సాగిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించామని, జల వివాదాలు పరిష్కరించుకొని ప్రగతిపథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని