వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక

పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 08 Jul 2024 04:34 IST

ఈనాడు, అమరావతి: పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం మంగళగిరిలో ‘గ్రామాల్లో ఘనవ్యర్థాల నిర్వహణపై’ పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమయ్యారు. ‘వ్యర్థాల నిర్వహణపై చైతన్యం తీసుకురావాలి. పర్యావరణంపై ఆసక్తి ఉన్న వారిని ‘ఎకో వారియర్స్‌’గా ఎంపిక చేయాలి’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణపై ఘన, ద్రవ వనరుల నిర్వహణ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్‌ సి.శ్రీనివాసన్‌ మంత్రికి నివేదిక అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని