ఉద్యోగుల ఆశలు నెరవేరతాయనే నమ్మకం ఉంది

రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆశలు నెరవేరతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు,

Published : 08 Jul 2024 04:36 IST

ఏపీ ఐకాస, ఆర్టీసీ ఈయూ నేతలు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆశలు నెరవేరతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ప్రధాన కార్యదర్శి నరసయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభపడుతుందని వారు తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 11వ పీఆర్సీతో పాటు ఇతర బకాయిలు చెల్లించి, సమస్యలు పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరిస్తాం’ అని బొప్పరాజు తెలిపారు. ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రిఫరల్‌ ఆసుపత్రుల వైద్య సేవలను వారికి దూరం చేశారు. ఐదేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల నియామకాలు జరగలేదు. వాటిని భర్తీ చేసి ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని దామోదరరావు కోరారు. ‘ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, విలీనానికి ముందున్న నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పదోన్నతులు ఇప్పించడం కోసం ఈయూ నాయకత్వం అందుబాటులో ఉంటుంది’ అని నరసయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని