పట్టిసీమకు జలహారతి

పట్టిసీమ ఎత్తిపోతల నుంచి మూడు రోజుల కిందట విడుదల చేసిన గోదావరి జలాలు ఆదివారం పోలవరం కాలువ ద్వారా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నది వద్దకు చేరాయి.

Published : 08 Jul 2024 04:38 IST

నున్న వద్ద మోటార్లు ఆన్‌ చేసి గోదావరి జలాలను చెరువులకు పంపుతున్న రైతులు

ఈనాడు, అమరావతి - రామవరప్పాడు, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల నుంచి మూడు రోజుల కిందట విడుదల చేసిన గోదావరి జలాలు ఆదివారం పోలవరం కాలువ ద్వారా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నది వద్దకు చేరాయి. దీని ద్వారా కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమను సస్యశ్యామలం చేసేలా లక్షల ఎకరాలకు సాగు నీరు, వేల గ్రామాలకు తాగునీరు అందుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 17 పంపుల ద్వారా 6,018 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేశారు. ఆదివారంనాటికి నున్న, ఇబ్రహీంపట్నానికి సమీపంలోని కృష్ణా నదిలోకి నీరు చేరుతోంది. దీంతో పలు గ్రామాల రైతులు పట్టిసీమ నీటికి పూజలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో పట్టిసీమ ద్వారా నీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు పేర్కొన్నారు.

జక్కంపూడి సమీపంలో పోలవరం కాలువలోకి చేరిన పట్టిసీమ నీరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని