డక్ట్‌లో లోపమే ప్రమాదానికి కారణం

బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో ప్రమాదానికి డక్ట్‌ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దుర్ఘటనకు కారణమేంటి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందనే వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్,

Published : 08 Jul 2024 04:41 IST

సుమారు 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో గ్యాస్‌
వారం రోజుల ముందే గుర్తించినా.. నిర్వహణలో నిర్లక్ష్యం

ఈనాడు, అమరావతి: బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో ప్రమాదానికి డక్ట్‌ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దుర్ఘటనకు కారణమేంటి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందనే వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, కార్మిక శాఖల అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు కారణమైన బాయిలర్‌ కర్మాగారంలోని మూడో అంతస్తులో ఉంది. సిమెంటు తయారీ కోసం వినియోగించే ముడిపదార్థం పైనుంచి డక్ట్‌లోకి వస్తుంది. దానికి ఎదురుగా హాట్‌ గ్యాసెస్‌ పంపుతారు. సిమెంటు తయారీకి వినియోగించే పౌడర్‌ పైనుంచి వచ్చేటప్పుడు పేరుకుపోకుండా.. ఒక డమ్మీ డక్టర్‌ ఏర్పాటుచేశారు. దీనికోసం ఒక హోల్‌కు షీట్‌ను వెల్డింగ్‌ చేసి పెట్టారు. ఈ పౌడర్‌ ప్లేట్‌ మీద పరిమితికి మించి ముడిపదార్థం పేరుకుపోయిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పైపులైన్‌కు వెల్డింగ్‌ చేసిన ప్రాంతంలోని ప్లేట్‌ తెరుచుకుని.. దాదాపు 800 డిగ్రీల వేడి పొడి కార్మికులపై పడిందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. 

వారం రోజుల ముందే గుర్తించారా?: డక్ట్‌కు లీకేజి ఉందని వారం రోజులుగా అక్కడ పనిచేసే కార్మికులు నిర్వహణ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దాని గురించి వారు పట్టించుకోకపోవడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమా? అనే అనుమానాన్ని కొందరు సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. దీని నిర్వహణలో లోపం కారణంగా ఒత్తిడి పెరిగి డక్ట్‌ అడుగుభాగంలో ప్లేట్‌ తెరుచుకుందని అధికారుల ప్రాథమిక అంచనా. ఈ దుర్ఘటనపై అధికారులు సోమవారం ప్రభుత్వానికి నివేదికను ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని