ప్రేమోన్మాదిని పట్టుకునేందుకు తొమ్మిది బృందాలు: హోం మంత్రి అనిత

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక బద్ది దర్శినిని హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Published : 08 Jul 2024 04:47 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక బద్ది దర్శినిని హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. నిందితుడు సురేష్‌ను పట్టుకునేందుకు 9 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తనతో మాట్లాడారని పేర్కొన్నారు. బాలిక కుటుంబసభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామని తెలిపారు. గంజాయి మత్తు నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని