నేడు ఇంధన శాఖపై శ్వేతపత్రం

రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైకాపా ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది? అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా రాష్ట్ర విద్యుత్తు రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం సోమవారం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది.

Published : 08 Jul 2024 04:47 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైకాపా ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది? అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా రాష్ట్ర విద్యుత్తు రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం సోమవారం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పట్లో మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది? వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని