బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విలువైన ఆస్తి దానం

బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి తెనాలికి చెందిన విశ్రాంత ప్రిన్సిపల్‌ పి.రమాదేవి రూ.కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం ఆస్తి ఆ ఆసుపత్రికి చెందేలా వీలునామా రాశారు.

Published : 09 Jul 2024 04:04 IST

విశ్రాంత మహిళా ప్రిన్సిపల్‌ ఉదారత

పి.రమాదేవి ఆస్తిపత్రాలను ఆమె తరఫున బసవతారకం క్యాన్సర్‌ వైద్యశాలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న ఆమె సంరక్షకుడు పి.చూడామణిరెడ్డి.. చిత్రంలో డాక్టర్‌ సీతా దయాకర్, ప్రతాప్‌రెడ్డి 

ఈనాడు డిజిటల్, అమరావతి: బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి తెనాలికి చెందిన విశ్రాంత ప్రిన్సిపల్‌ పి.రమాదేవి రూ.కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం ఆస్తి ఆ ఆసుపత్రికి చెందేలా వీలునామా రాశారు. సంబంధిత పత్రాల్ని ఆమె సంరక్షకులు సచివాలయంలో సీఎం చంద్రబాబుకు సోమవారం అందించారు. రమాదేవి.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ చేశారు. ఆమె ముగ్గురు కుమారులు  అమెరికాలో స్థిరపడ్డారు. క్యాన్సర్‌ సోకిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్న బసవతారకం ఆసుపత్రికి ఆస్తిని సంతృప్తిగా అందజేస్తున్నట్లు రమాదేవి తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికీ తన వంతుగా సాయం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు సంరక్షకులు తెలిపారు. కార్యక్రమంలో సంరక్షకుడు పి.చూడామణిరెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్‌ సీతా దయాకర్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని