డయాఫ్రం వాల్‌ను పునర్నిర్మించాలని.. జగన్‌కు గతంలోనే సూచించాం

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు నామమాత్రంగా మరమ్మతులు చేయకుండా తిరిగి కొత్తగా నిర్మించాలని అప్పటి సీఎం జగన్‌కు రెండేళ్ల క్రితమే సూచించినట్లు నవ్యాంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వెల్లడించారు.

Published : 09 Jul 2024 04:07 IST

నవ్యాంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు నామమాత్రంగా మరమ్మతులు చేయకుండా తిరిగి కొత్తగా నిర్మించాలని అప్పటి సీఎం జగన్‌కు రెండేళ్ల క్రితమే సూచించినట్లు నవ్యాంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు తగిన వివరాలతో సీఎం చంద్రబాబుకు సోమవారం ఆయన లేఖ రాశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పోలవరం కూడా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకూడదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద ఉన్న ప్రాంతాల్లోకి నీరు చేరకుండా పనులు చేపట్టాలి’ అని 2022లో జగన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని