అక్టోబరులో టెట్‌ పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 90 రోజుల సమయం ఇచ్చినందున టెట్‌ షెడ్యూల్‌ను మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల సమర్పణకు, రుసుము చెల్లింపునకు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించింది.

Published : 09 Jul 2024 04:07 IST

90 రోజుల సమయం ఇచ్చినందున షెడ్యూల్‌ మార్పు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 90 రోజుల సమయం ఇచ్చినందున టెట్‌ షెడ్యూల్‌ను మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల సమర్పణకు, రుసుము చెల్లింపునకు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించింది. మాక్‌ టెస్ట్‌లను సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉంచనుంది. అదే నెల 22 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షలను అక్టోబరు 3 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఇవి రెండు విడతలుగా ఉంటాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. తుది ‘కీ’ని 27న, ఫలితాలు నవంబరు 2న విడుదల చేస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని