సీఈఓ బాధ్యతల నుంచి ముకేశ్‌కుమార్‌ మీనా రిలీవ్‌!

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా త్వరలో ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యే అవకాశముంది. మీనా సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాసింది.

Published : 09 Jul 2024 04:13 IST

ముగ్గురు డైరెక్ట్‌ ఐఏఎస్‌ల పేర్లు పంపాలని రాష్ట్రానికి ఈసీఐ సూచన 

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా త్వరలో ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యే అవకాశముంది. మీనా సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాసింది. సీఈఓ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఈసీఐ ఆదేశాలతో.. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి, టిడ్కో ఎండీ శ్రీధర్‌ పేర్లను పంపించింది. ఈ ముగ్గురు అధికారులూ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లు కావటంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను వెనక్కి పంపింది. వారి స్థానంలో డైరెక్ట్‌ రిక్రూటీ ఐఏఎస్‌ అధికారుల పేర్లతో జాబితా పంపాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో కొత్త జాబితాను పంపించే అవకాశముంది. అందులో నుంచి ఒకర్ని ఎన్నికల సంఘం సీఈఓగా నియమించిన తర్వాత.. మీనా ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని