అమరావతికి పింఛనుదారుల విరాళం రూ.7.35 లక్షలు

రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిఒక్కరూ కాంక్షిస్తున్నారని, పింఛనుదారులు సైతం ముందుకు వచ్చి భారీ విరాళం అందించడం అభినందనీయమని తెదేపా నాయకులు పేర్కొన్నారు.

Published : 09 Jul 2024 04:14 IST

విరాళం ఇచ్చిన పింఛనుదారుల జాబితా ప్రదర్శిస్తున్న తెదేపా నాయకులు

రామగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిఒక్కరూ కాంక్షిస్తున్నారని, పింఛనుదారులు సైతం ముందుకు వచ్చి భారీ విరాళం అందించడం అభినందనీయమని తెదేపా నాయకులు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పింఛనుదారులు అమరావతి అభివృద్ధికి రూ.7,35,416 అందించినట్లు వారు వెల్లడించారు. ఈ మొత్తాన్ని డీడీ తీసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు రామ్మూర్తినాయుడు, పార్టీ మండల  కన్వీనర్‌ సుధాకర్, పరంధామయాదవ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పోతన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు