ఉచిత ఇసుక కోసం లారీల బారులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్‌ జిల్లా కీసర స్టాక్‌యార్డు వద్ద ఉదయం ఆరింటినుంచే లారీలు బారులుదీరి కనిపించాయి.

Published : 09 Jul 2024 04:15 IST

కీసర వద్ద ఇసుక కోసం బారులు తీరిన లారీలు 

ఈనాడు, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్‌ జిల్లా కీసర స్టాక్‌యార్డు వద్ద ఉదయం ఆరింటినుంచే లారీలు బారులుదీరి కనిపించాయి. జాతీయ రహదారి పొడవునా స్టాక్‌యార్డు నుంచి కంచికచర్ల వైపు రెండు కిలోమీటర్ల వరకు లారీలు, ట్రాక్టర్లను వరసగా నిలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సాయంత్రం వరకు వేచిచూశారు. చివరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇసుక లోడింగ్‌ను ప్రారంభించారు.

స్టాక్‌యార్డుల వద్ద డిజిటల్‌ చెల్లింపులు

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఇసుక స్టాక్‌యార్డులు, రేవుల వద్ద డిజిటల్‌ చెల్లింపులు ఉండేవి కావు. నగదు చెల్లిస్తేనే ఇసుక ఇస్తామని వైకాపా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇలా ఇసుక అమ్మకాల్లో రూ.కోట్లు చేతులు మారాయంటూ ప్రతిపక్షాల ఆందోళనలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఇసుక యార్డుల వద్ద యూపీఐతోనే చెల్లిస్తున్నారు. డబ్బులు తీసుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని