వరి, పచ్చిరొట్ట విత్తనాలూ నాసిరకమే!

వైకాపా పాపాలు రైతుల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం నుంచి దిగిపోయే సమయంలోనూ నాసిరకం విత్తనాల్ని సేకరించి వాటిని రైతులకు అంటగట్టే ప్రయత్నం చేశారు.

Updated : 09 Jul 2024 05:32 IST

రైతుల్ని వెంటాడుతున్న వైకాపా పాపాలు 

ఈనాడు, అమరావతి: వైకాపా పాపాలు రైతుల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం నుంచి దిగిపోయే సమయంలోనూ నాసిరకం విత్తనాల్ని సేకరించి వాటిని రైతులకు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఈ విషయం బయటపడింది. అవి కూడా ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసినవి కావడం గమనార్హం. వరి విత్తనాలతోపాటు.. చాలాచోట్ల పచ్చిరొట్ట విత్తనాల్లోనూ నాణ్యత లేదని తేలింది. అయితే కొన్నిచోట్ల తిప్పి పంపామని అధికారులు చెబుతున్నా.. అధిక శాతం చోట్ల ఇప్పటికే రైతులు వాటిని కొనేశారు. వాటిని వెనక్కి కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. విత్తనాలు సరిగా లేకపోతే పంట కాలాన్ని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సరఫరా చేసిన వాటిలో కొన్ని బ్యాచ్‌లకు సంబంధించి.. ఎంటీయూ 1064, ఎంటీయూ 1061, ఎంటీయూ 7029 రకం వరి విత్తనాల్లో నాణ్యత లేదని అధికారులు గుర్తించారు. పచ్చిరొట్ట విత్తనాల్లో జీలుగ, పిల్లిపెసర విత్తనాల్లో చాలా బ్యాచ్‌లకు సంబంధించిన విత్తనాలు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు పరీక్షల్లో నాసిరకం విత్తనాలని తేలినా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వం మారడంతో అసలు విషయం బయటకొస్తోందని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు