232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు

రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

Published : 09 Jul 2024 05:33 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

అందుబాటులోకి రాని వెబ్‌ ఆప్షన్లు..

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇది అందుబాటులోకి రాలేదు. కళాశాలలకు అనుమతుల జీఓను ఉన్నత విద్యాశాఖ సోమవారమే ఇచ్చింది. వీటిని కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వలేదు. మంగళవారం నుంచి ఐచ్ఛికాలకు అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని