ప్రభుత్వ కార్యాలయాలుగా అక్రమ కట్టడాలు

ప్రభుత్వ, ఎసైన్డ్‌ స్థలాలను కొందరు వైకాపా నేతలు ఆక్రమించి, వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు.

Published : 10 Jul 2024 05:04 IST

కనిగిరిలో మున్సిపల్‌ యంత్రాంగం చర్యలు

అక్రమంగా కట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగ కార్యాలయంగా మారుస్తున్నారిలా..

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ఎసైన్డ్‌ స్థలాలను కొందరు వైకాపా నేతలు ఆక్రమించి, వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డినగర్‌ జాతీయ రహదారి పక్కన ఐదుగురు వైకాపా కౌన్సిలర్లు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ఆక్రమించుకున్నారు. అనంతరం వాటిలో వెంచర్లు వేయడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ టి.వి.రంగారావు ఆధ్వర్వంలో అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని సచివాలయాలు, విద్యుత్తు కార్యాలయాలు, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాలుగా ఉపయోగించడానికి చర్యలు చేపట్టారు. అలాగే కనిగిరి-పామూరు రోడ్డులో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలనూ స్వాధీనం చేసుకుని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంగా ఉపయోగించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. 

కాశిరెడ్డినగర్‌లో స్వాధీనం చేసుకున్న మరో భవనాన్ని విద్యుత్తు శాఖ కార్యాలయంగా వినియోగానికి సిద్ధం చేస్తున్నారిలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని