16న మంత్రి మండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి ఈనెల 16న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది.

Published : 10 Jul 2024 04:09 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రి మండలి ఈనెల 16న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం ఈనెల 11న సాయంత్రం 4 గంటల్లోగా అన్ని ప్రభుత్వశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని