తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు మాయం

ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని వీరంజిపురం, పెదగోగులపల్లి రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన దస్త్రాలు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు కలకలం రేకెత్తిస్తున్నాయి.

Published : 10 Jul 2024 04:11 IST

జేసీకి ఫిర్యాదు చేసిన రైతులు

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని వీరంజిపురం, పెదగోగులపల్లి రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన దస్త్రాలు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు కలకలం రేకెత్తిస్తున్నాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంజిపురం. పెదగోగులపల్లి రెవెన్యూ గ్రామాలకు చెందిన 1-బి, ఎఫ్‌ఎల్‌ఆర్, టెన్‌వన్, పాత అడంగళ్లు గల్లంతయ్యాయి. కొన్ని దస్త్రాలను ట్యాంపరింగ్‌ చేసినట్లు తెలిపారు. కొందరు రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు దస్త్రాలను కావాలనే మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సి.ఎస్‌.పురం వచ్చిన సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణను ఆయా గ్రామాల రైతులు కలిసి రెవెన్యూ దస్త్రాలు మాయమవడంపై ఫిర్యాదు చేశారు. పెదగోగులపల్లి వీఆర్వో రికార్డులను మాయం చేసినట్లు రైతులు ఆరోపించారు. కొన్నేళ్ల కిందట సి.ఎస్‌.పురం 1-బి దస్త్రాన్ని, నివేశన స్థలాల లేఅవుట్లు, ఇతర రికార్డులను కార్యాలయంలో లేకుండా రెవెన్యూ అధికారులు మాయంచేశారు. ఆ తర్వాత కొత్త 1-బిని తయారు చేశారు. వైకాపా నాయకులు అధికారులను మచ్చిక చేసుకొని దస్త్రాల్లో అనేక పేర్లు మార్పులు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డుల్లో జరిగిన మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సీఎస్‌పురం తహసీల్దార్‌ షేక్‌ నాగూల్‌ మీరాను వివరణ కోరగా.. తాను వచ్చేనాటికి ఏ దస్త్రాలు ఉన్నాయో అవే ఉన్నాయని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని