శిరోముండనం కేసు రికార్డుల్ని మా ముందుంచండి

దళితులకు శిరోముండనం, మీసాలు, కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులకు సంబంధించి విచారణ(ట్రయల్‌) కోర్టు వద్ద ఉన్న రికార్డుల్ని తమ ముందుంచేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.

Published : 10 Jul 2024 04:19 IST

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం 

ఈనాడు, అమరావతి: దళితులకు శిరోముండనం, మీసాలు, కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులకు సంబంధించి విచారణ(ట్రయల్‌) కోర్టు వద్ద ఉన్న రికార్డుల్ని తమ ముందుంచేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. త్రిమూర్తులు తదితరులకు 18 నెలల జైలు, జరిమానా విధిస్తూ దిగువ కోర్టు విధించిన శిక్ష అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని పొడిగించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుతోపాటు మరో 8 మందికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ అప్పీళ్లు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. దళిత బాధితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎత్తివేయాలని అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. దానిపై త్వరగా విచారణ జరపాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ పిటిషన్‌పై ఎందుకు? ప్రధాన అప్పీళ్లపైనే తుది విచారణ చేస్తామన్నారు. దిగువ కోర్టులో రికార్డుల్ని తమ ముందు ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని