జోగి కుటుంబం భూకబ్జా దర్యాప్తు ఏసీబీకి బదిలీ

ఎటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబసభ్యుల వ్యవహారంపై దర్యాప్తును ఏసీబీ చేపట్టనుంది.

Published : 10 Jul 2024 04:20 IST

ఈనాడు, అమరావతి: ఎటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబసభ్యుల వ్యవహారంపై దర్యాప్తును ఏసీబీ చేపట్టనుంది. ఈ ఉదంతంపై ఇప్పటికే విజయవాడ పోలీసుల నుంచి ప్రాథమిక నివేదిక డీజీపీకి చేరింది. జోగి రమేష్‌ తన పదవిని అడ్డుపెట్టుకుని అగ్రిగోల్డ్‌ భూములను తప్పుడు మార్గాల్లో కుటుంబసభ్యుల పేరున రిజిస్టర్‌ చేయించిన సంగతి తెలిసిందే. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సీఐడీ ఆధీనంలోని అగ్రిగోల్డ్‌ భూముల్లోకి చొచ్చుకెళ్లి కుమారుడు రాజీవ్, బాబాయి జోగి వెంకటేశ్వరరావు పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. తర్వాత వైకాపా కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులకు విక్రయించినట్లు వెల్లడైంది. పోలీసుల నివేదికను పరిశీలించిన డీజీపీ.. దర్యాప్తును అనిశాకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు