జోగి రమేష్‌ పిటిషన్‌పై వివరాలివ్వండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటిపై మూకుమ్మడి దాడి ఘటనలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Published : 10 Jul 2024 04:21 IST

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటిపై మూకుమ్మడి దాడి ఘటనలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 2021లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అయన ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు పెట్టారు. ఈ కేసులో తాజాగా దర్యాప్తు ప్రారంభం కావడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని