శేషాచలంలో అరుదైన శ్రీలంక కప్ప

శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన ‘శ్రీలంకన్‌ స్యూడో ఫిలేటస్‌ రిజియస్‌’గా పిలిచే గోధుమ రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవుల్లో పరిశోధకులు కనుగొన్నారు.

Published : 10 Jul 2024 05:11 IST

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన ‘శ్రీలంకన్‌ స్యూడో ఫిలేటస్‌ రిజియస్‌’గా పిలిచే గోధుమ రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవుల్లో పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవవైవిధ్య మండలి పరిశోధకులు మంగళవారం వెల్లడించారు. శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో కనిపించే ఈ కప్ప శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం ప్రాంతంలో కనిపించిందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ధ్రితి బెనర్జీ తెలిపారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ పత్రిక జూటాక్స్‌లో పరిశోధన వ్యాసం ప్రచురితమైందని వివరించారు. ఒకప్పుడు భారతదేశం, శ్రీలంక భూభాగాలు కలిసే ఉండేవన్న వాస్తవాన్ని ఈ పరిశోధన నిరూపిస్తోందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని