ఆ వైద్యురాలికి ఆరోసారి డిప్యుటేషన్‌ పొడిగింపు

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. వైకాపా ప్రభుత్వంలో డిప్యుటేషన్లపై పనిచేసిన వారికి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి.

Published : 10 Jul 2024 04:27 IST

ఈనాడు, అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. వైకాపా ప్రభుత్వంలో డిప్యుటేషన్లపై పనిచేసిన వారికి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా జొన్నవాడ పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ పి.అన్నపూర్ణ 2019లో ఏడాది కాలపరిమితితో సచివాలయంలోని సీఎం ఆరోగ్య నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కార్యాలయంలో డిప్యుటేషన్‌పై చేరారు. అప్పటి నుంచి ఆమె సేవలను ఏడాది చొప్పున పొడిగిస్తుండగా.. గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జులై 14తో డిప్యుటేషన్‌ గడువు ముగిస్తుంది. కానీ, మరో 6 నెలలపాటు ఆమెను డిప్యుటేషన్‌లో కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ కె.పద్మావతి ఈనెల 5న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సహచర వైద్యుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్‌ఎఫ్‌లో మరొకరిని నియమించేందుకు వీలుగానే ప్రస్తుతం ఆరు నెలలపాటే కొనసాగించేలా ఉత్తర్వులిచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు