అదనపు ఏజీగా సాంబశివ ప్రతాప్‌

ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా న్యాయవాది ఇవన సాంబశివ ప్రతాప్‌ నియమితులయ్యారు.

Published : 10 Jul 2024 05:04 IST

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం  

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా న్యాయవాది ఇవన సాంబశివ ప్రతాప్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సాంబశివ ప్రతాప్‌ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడికి చెందినవారు. ఉమ్మడి హైకోర్టు, విభజిత ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా అపార అనుభవం ఉంది. 1996 నుంచి 2002 మధ్యలో మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా ఆంధ్రా రీజన్‌ మున్సిపాలిటీల తరఫున వాదనలు వినిపించారు. 2016-19 మధ్య ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయ సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ లీగల్‌సెల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని