వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించుకోవాలి

వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు.

Published : 10 Jul 2024 04:33 IST

బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

ఈనాడు, అమరావతి: వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అధికారులతో వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు. ‘వసతి గృహ నిర్వహణపై కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి. విద్యార్థులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా రెగ్యులర్‌గా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకు మెరుగైన విద్య అందేలా ట్యూటర్లను నియమించుకోవడంతోపాటు ప్రత్యేక తరగతులూ నిర్వహించాలి. వసతి గృహ సంక్షేమ అధికారి తప్పనిసరిగా హెడ్‌ క్వార్టర్‌లో లేకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి’ అని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబరు నుంచి డైట్, కాస్మొటిక్‌ ఛార్జీలు     పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎంతో మాట్లాడి త్వరగా మంజూరయ్యేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని