ఇదేం ‘గూడు’పుఠాణి!.. నందనవనాన్ని తలపిస్తున్న జగన్‌ నివాస మార్గం

రహదారి పొడవునా కిలోమీటరు మేర రంగురంగుల పూలమొక్కలు, డివైడర్‌ మధ్యలో ఖరీదైన పచ్చని చెట్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలతో సుందరంగా కనిపిస్తున్న ఈ రహదారి ఎక్కడో విదేశాల్లో ఉందనుకుంటే పొరపాటే.

Updated : 11 Jul 2024 07:01 IST

అంతటా విధ్వంసం.. ఇక్కడ మాత్రం పచ్చతోరణం

తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్‌ నివాసం వద్ద రహదారిపై కి.మీ మేర పచ్చదనం, రంగురంగుల పూలమొక్కలు

రహదారి పొడవునా కిలోమీటరు మేర రంగురంగుల పూలమొక్కలు, డివైడర్‌ మధ్యలో ఖరీదైన పచ్చని చెట్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలతో సుందరంగా కనిపిస్తున్న ఈ రహదారి ఎక్కడో విదేశాల్లో ఉందనుకుంటే పొరపాటే. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండగా తాడేపల్లిలోని తన నివాసం వైపు రహదారిపైకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించమే కాకుండా పట్టణ సుందరీకరణ నిధుల నుంచి రూ.లక్షలు వెచ్చించి పనులు చేయించారు. జగన్‌ నివాసం వద్ద ఇటీవల ఆంక్షలు తొలగడంతో సామాన్యులంతా ఈ రహదారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి రహదారి ఒకటి ఐదేళ్లుగా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. తాడేపల్లిలో ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉద్యానవనాల్లో పచ్చదనం మచ్చుకైనా కనిపించదు. జగన్‌ ఇంటి వద్ద మాత్రం నందనవనాన్ని తీర్చిదిద్దారు. మొక్కల పరిరక్షణకు ప్రత్యేకంగా బోర్లనూ ఏర్పాటుచేశారు. అప్పట్లో సీఎం బయటకొస్తే ఎక్కడపడితే అక్కడ ఏదో ఒక నెపంతో చెట్లను నరికేసిన అధికారులు జగన్‌ ఇంటి వద్ద మొక్కల పెంపకానికి అంచనాలకు మించి శ్రద్ధ చూపారు.

డివైడర్‌ మధ్యలో ఆకర్షణీయంగా చెట్లు

ఈనాడు అమరావతి, న్యూస్‌టుడే తాడేపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని