ఉన్నత విద్యా మండలిలో నిధుల దుర్వినియోగంపై పిల్‌

రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాలపై విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది.

Published : 11 Jul 2024 03:54 IST

ఉన్నత అధికారులకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాలపై విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలంటూ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఉన్నత విద్యామండలి తాజా మాజీ ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ కె.రామ్మోహనరావు తదితరులు అధికార దుర్వినియోగం చేస్తూ.. అర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి సొమ్మును రాబట్టాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బల్లిపోగు శ్రీరాములు, బంటుపల్లి నాగరాజు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని