రఘురాజు వ్యాజ్యం విచారణకొచ్చేలా చర్యలు తీసుకోండి

తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ వైకాపా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ధర్మాసనం ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ చీమలపాటి రవి ఆదేశించారు.

Published : 11 Jul 2024 03:55 IST

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ వైకాపా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ధర్మాసనం ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ చీమలపాటి రవి ఆదేశించారు. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అనినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిందన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. రఘురాజు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని