గంజాయి నియంత్రణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక

గంజాయి నియంత్రణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Published : 11 Jul 2024 03:56 IST

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 

సమావేశంలో మంత్రి సంధ్యారాణి, చిత్రంలో కలెక్టర్‌  దినేష్‌కుమార్, ఎస్పీ తుహిన్‌ సిన్హా

పాడేరు, న్యూస్‌టుడే: గంజాయి నియంత్రణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆమె పర్యటించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘గిరిజనులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. గంజాయికి దూరంగా ఉండండి’ అని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని, వారు దీని నుంచి బయటపడేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అల్లూరి జిల్లాకు గంజాయి మచ్చ తొలగించేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని కోరారు. ‘ఏజెన్సీలో ఉన్న గురుకులాలను పదో తరగతి నుంచి 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేస్తాం.. పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులు కూడా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. గత ప్రభుత్వం నాడు-నేడు అంటూ పాఠశాలలకు రంగులు వేసి, నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 408 పాఠశాలలకు భవనాలు లేవని గుర్తించారు. వాటి నిర్మాణానికి రూ.57 కోట్లు అవుతాయని అంచనా వేసి  ప్రతిపాదనలు పంపతున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని