వైకాపా వారికే ఫిషింగ్‌ హార్బర్ల పనులా?

గత ప్రభుత్వ హయాంలో అయిదు హార్బర్ల నిర్మాణాన్ని వైకాపా వారికే కట్టబెట్టారని, పనులు ప్రారంభించకుండానే 40 శాతం సొమ్ము కూడా చెల్లించారని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 11 Jul 2024 03:57 IST

మత్స్య శాఖపై సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అయిదు హార్బర్ల నిర్మాణాన్ని వైకాపా వారికే కట్టబెట్టారని, పనులు ప్రారంభించకుండానే 40 శాతం సొమ్ము కూడా చెల్లించారని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిమడక, కొత్తపట్నం, వాడరేవు, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్ల పనులపై పూర్తి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 2019-24 మధ్య మత్స్య శాఖలో చేపట్టిన పనులపై పునఃపరిశీలన చేసి వివరాలు ఇవ్వాలని సూచించారు. బుధవారం పెనమలూరులోని కమిషనరేట్‌లో మత్స్య శాఖపై ఆయన సమీక్షించారు. ‘గత ప్రభుత్వంలో అసలు మత్స్య శాఖ ఉందా? అనేలా పరిస్థితి తయారైంది. మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ బకాయిలు రూ. 10 కోట్లు వెంటనే చెల్లించాలి’ అని ఆదేశించారు. మత్స్యకార భృతి లబ్ధిదారుల జాబితాపై పునఃపరిశీలన చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. 2014-19 మధ్య అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయవాడ, కలిదిండిలోని ఆక్వా హబ్స్‌ మాదిరిగానే.. జిల్లా కేంద్రాల్లోనూ వాటి ఏర్పాటుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఆక్వా, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్‌బాబు, మత్స్య శాఖ కమిషనర్‌ సూర్యకుమారి, అదనపు సంచాలకులు అంజలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు