వ్యవసాయ కార్మికులకు బోర్డు ఏర్పాటుచేయాలి

వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన రైతు చర్చా వేదికలో ఆయన మాట్లాడారు.

Published : 11 Jul 2024 03:57 IST

విజయవాడలో చర్చా వేదిక డిమాండ్‌

ఈనాడు, అమరావతి: వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన రైతు చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు తెదేపా ఇచ్చిన హామీ మేరకు కేరళ తరహాలో చట్టం తెచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని సమావేశంలో వక్తలు కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బండ్ల శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు ముజఫర్‌ అహ్మద్, కౌలు రైతు సంఘం నాయకుడు హరిబాబు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో 1.40 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని.. వీరిలో దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని వక్తలు వెల్లడించారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం వ్యవసాయ కార్మికులకు వేతనాల అమలు, బోర్డు ద్వారా పిల్లల చదువులకు ఆర్థిక, వైద్య సాయం, ఇల్లు కట్టుకోవడానికి, మరమ్మతులకు సాయం అందించాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని