పెండింగ్‌ జీతాలివ్వండి: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌)లో పని చేస్తున్న వంద మంది పొరుగు సేవల శిక్షకులకు నాలుగు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 11 Jul 2024 03:57 IST

శాప్‌ పొరుగు సేవల శిక్షకుల ఆవేదనపై స్పందన

శాప్‌ కార్యాలయం ముందు  పొరుగు సేవల శిక్షకుల నిరసన

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌)లో పని చేస్తున్న వంద మంది పొరుగు సేవల శిక్షకులకు నాలుగు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విసిగిపోయిన శిక్షకులు విజయవాడ ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలోని శాప్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు గంటా సంపత్‌కుమార్‌ నిరసన కార్యక్రమంలో పాల్గొని పొరుగు సేవల శిక్షకులకు మద్దతు పలికారు. కార్యక్రమంలో శాప్‌ పొరుగు సేవల శిక్షకుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వేణుకుమార్, పలు జిల్లాల శిక్షకులు పాల్గొన్నారు. దీనిపై రాష్ట్ర క్రీడాశాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పందించి పొరుగు సేవల శిక్షకుల జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని